తెలంగాణ
ప్రజలకు పోలీసులే మొదటి నమ్మకం- సీఎం రేవంత్
Cm Revanth: టెక్నాలజీ వాడుకుంటూ నేరాల నియంత్రణకు యువ అధికారులు పని చేయాలని కొత్త డీఎస్పీలకు సందేశం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు ఏ సమస్య వచ్చినా మొదట గుర్తుకొచ్చేది పోలీస్ అని చెప్పారు. పారదర్శక పోలీసింగ్ ద్వారా ప్రజల నమ్మకాన్ని సంపాదించాలని సూచించారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) -2025 రెండో బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొన్నారు.
