తెలంగాణ
ఉచిత బస్సు పై సీఎం రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు!..
మహిళల ఉచిత బస్సు స్కీమ్‌పై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు మహిళలకు ఉచిత బస్సు పథకం ఉంటుందని ప్రకటించారు. ఇవాళ కోటి మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం చూసి కొందరు తట్టుకోలేకపోతున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రద్దు చేయాలని ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
