తెలంగాణ

సొంత నియోజకవర్గంపై సీఎం రేవంత్ ఫోకస్..

Cm Revanth: సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. తన ఇలాకాలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచనున్నారు. ఇందులో భాగంగా కొడంగల్ లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు.