అభిప్రాయం
ఆ 45 ఎకరాల గుర్తింపునకు సర్వే చేయండి- ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Erravalli Lands: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలో 45 ఎకరాల భూముల ఆచూకీ లభ్యం కానుందున, వాటి గుర్తింపునకు వెంటనే సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 22ఏపై శాసనసభలో గత నెల 16న నిర్వహించిన చర్చలో ఆ భూములపై విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ విచారణ పురోగతిపై ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధీ పెవిలియన్ లో ముఖ్యమంత్రి రేవంత్ మంగళవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, భూ అక్రమాలపై విచారణకు వేసిన కమిటీ, ధరణి అక్రమాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ సభ్యులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
