తెలంగాణ

సొంత జిల్లా రైతాంగానికే ద్రోహం- సీఎం రేవంత్‌పై డీకే అరుణ నిప్పులు

Dindi: సీఎం రేవంత్ రెడ్డిపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ నిప్పులు చెరిగారు. పాలమూరు ప్రజల ఆశీర్వాదంతో సీఎం కుర్చీ దక్కించుకున్న రేవంత్ రెడ్డి.. నాడు కేసీఆర్ పాలమూరు మెడకు వేసిన ‘డిండి ఉరితాడు’ను ఇప్పుడు బిగించే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట పాలమూరు జిల్లా రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ తో కలిసి నిర్వహించిన నీటిపారుదల సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే ముఖ్యమంత్రికి ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఏమాత్రం ప్రేమ లేదని స్పష్టమవుతోందని ఫైరయ్యారు.