తెలంగాణ
నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్
సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గత రెండ్రోజులుగా ఆయన అక్కడే పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. నిన్న దీపావళి పండుగతో పాటు సీఎం పుట్టిన రోజు కావడంతో నియోజకవర్గంలో సెలబ్రేషన్స్ అంబరాన్ని అంటాయి. నేటితో సీఎం రేవంత్ కొడంగల్ పర్యటన ముగియనుంది. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా సీఎం పలు కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. చివరి రోజు పర్యటనలో భాగంగా పారిశ్రామిక రంగ విస్తరణ, రవాణా మౌలిక వసతుల బలోపేతమే లక్ష్యంగా చేపడుతున్న ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. లగచర్లలో ఆయిల్‌పామ్ పరిశ్రమకు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. కోస్గి మండలం నాచారం వద్ద రేడియల్ రోడ్డు-2 పనుల ప్రారంభంలోనూ పాల్గొననున్నారు.
