తెలంగాణ

బహదూర్‌గూడ భూములపై సీఎం రేవంత్ కన్ను పడింది- కేటీఆర్

Ktr: బహదూర్ గూడ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ భూ బాధితులతో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. బహదూర్ గూడ రైతులతో మాట్లాడిన కేటీఆర్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భూ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు కేటీఆర్. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.

మూడేళ్లలో సీఎం రేవంత్ ఒక్క మంచి పనైనా చేశారా? అని కేటీఆర్ అడిగారు. బహదూర్ గూడ భూములపై రేవంత్ కన్ను పడిందన్న కేటీఆర్.. సుప్రీంకోర్టు వెళ్లి బహదూర్ గూడ భూములను కాపాడుతామని ప్రకటించారు. బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతులను నిండా ముంచుతున్నారని, ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు కేటీఆర్. రేవంత్ రెడ్డికి భూముల దందా తప్ప మరేమీ తెలియదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నాడనే విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోతున్నారన్న కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఏడాది మాత్రమే ఉందని గుర్తు చేశారు.