తెలంగాణ
TG: దేశంలో నియంతృత్వంతో ప్రజాస్వామ్యం పోరాడుతోంది.. మోడీపై సీఎం రేవంత్ విమర్శలు
TG: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రజాస్వామ్యం, నియంతృత్వం అనే రెండు శక్తుల మధ్య తీవ్ర పోరాటం కొనసాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరిచి, అధికారాన్ని కేవలం ఒకే వ్యక్తి లేదా ఒకే పార్టీ చేతుల్లో కేంద్రీకరించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాము రాజ్యాంగం, చట్టబద్ధ పాలన, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడుతున్నామని సీఎం స్పష్టం చేశారు.ప్రభుత్వాలు కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తలు, బిలియనీర్ల ప్రయోజనాల కోసం కాకుండా కోట్లాది మంది సామాన్య ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పేదలు, రైతులు, మహిళలు, మైనారిటీల హక్కులను కాపాడటంతో పాటు సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పనే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
