తెలంగాణ
బీఆర్ఎస్ కుట్రలను ప్రజలకు వివరించాలి : సీఎం రేవంత్
TG: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం వాడి వేడిగా జరుగుతోంది. ఈ రోజు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వారికి సూచించారు.
అయితే ఈ సమావేశంలో గులాబీ పార్టీపై రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. “బీఆర్ఎస్‌కు అధికారం పోయినా అహంకారం పోలేదు” అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం కుట్ర చేసిందని ఆరోపించారు.
