తెలంగాణ
Cm Revanth - Hydraa: హైదరాబాద్ చెరువులకు జీవం పోస్తోంది- హైడ్రాపై సీఎం రేవంత్ ప్రశంసలు
హైడ్రా పని తీరుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పరిధిలోని చెరువులకు హైడ్రా జీవం పోస్తోందని సీఎం రేవంత్ అన్నారు. ఉప్పల్ నల్ల చెరువు జలకళను సంతరించుకున్నట్లు హైడ్రా షేర్ చేసిన వీడియోను సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. నల్ల చెరువు పునరుజ్జీవానికి అహర్నిశలు శ్రమించిన హైడ్రా అధికారులు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
