Cm Revanth: తెలంగాణకు చీకటి రోజు.. 4కోట్ల మందికి అవమానం
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు ముక్త కంఠంతో తాతా మధు వ్యాఖ్యలను ఖండించారు. అసభ్యపదజాలంతో స్పీకర్ ను దూషించిన తాతా మధును వెంటనే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తాతా మధు వ్యవహారంపై సీఎం రేవంత్ అసెంబ్లీలో తీవ్రంగా స్పందించారు. తాతా మధు వ్యాఖ్యలను ఖండించిన ముఖ్యమంత్రి రేవంత్..ఈరోజు నాలుగు కోట్ల ప్రజలకు అవమానం జరిగిందని వాపోయారు. సభాపతికి జరిగిన అవమానం.. సభ్య సమాజానికి జరిగిన అవమానంగా అభివర్ణించారు. ఇది అనాలోచితంగా జరిగిన చర్య కాదు పథకం ప్రకారం జరిగిందే అని ఆయన ఆరోపించారు.
ఇలాంటి భాష వాడిన తాతా మధును డిస్మిస్ చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, అలాగే స్పీకర్ ను ఉద్దేశించి అసభ్యకర భాష వాడిన తాతా మధుతో రాజీనామా చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
