National

సీఎం ఒమర్ అబ్దుల్లా కుర్చీకి గండం..ఉండేనా? ఊడేనా?

జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది.సీఎం ఒమర్ అబ్దుల్లాకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యి తీర్మానం సైతం చేసుకున్నట్టు సమాచారం. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తమ మీద కొందరు సీనియర్ల పెత్తనం ఎక్కువ అయ్యిందని.. సమస్యలు విన్నవించేందుకు వెళితే అధిష్టానం పట్టించుకోవడం లేదని నేషనల్ కాన్ఫరెన్స్ (NC)లోని కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఒమర్ అబ్దుల్లా సర్కారుపై సొంత ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేసే క్రమంలో ఉన్నట్టు తెలియడంతో ముఖ్యమంత్రి ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్న 24 మంది ఎమ్మెల్యేలు.. సీఎం ఒమర్ అబ్దుల్లాతో పాటు పార్టీ అధిష్ఠానానికి అల్టిమేటం పంపినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం శ్రీనగర్‌లోని NC ఎమ్మెల్యే ఖైజర్ జంషీద్‌లోన్ నివాసంలో 19 మంది ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. అనంతరం సీఎంకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.