ఏపీ
ఉత్తరాంధ్రకు గోదారమ్మ పరుగులు
Godavari Water: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదల అయ్యాయి. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లను విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకం ఆవిష్కరించారు చంద్రబాబు. ఆ తర్వాత రెగ్యులేటర్ ఆన్ చేసి నీటిని రిలీజ్ చేశారు. అనంతరం గోదావరికి అఖండ హారతి ఇచ్చారు. ఎడమ కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది.
పాయకరావుపేట మండలం పీఎల్ పురం వద్ద ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గోదారమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. నీటి విడుదల సందర్భంగా గోదారమ్మకు సాష్టాంగ నమస్కారం చేశారు.
