తెలంగాణ
సీఎం, మంత్రి ఆదేశాలు బేఖాతర్.. ‘రెవెన్యూ’లో ఏం జరుగుతోంది?
రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 22ఏ నిషేధితా జాబితా భూముల గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో ఓ వైపు సీఎం రేవంత్, మరోవైపు సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి బాధితులకు న్యాయం చేస్తామని చెబుతున్నా..క్షేత్రస్థాయిలో మాత్రం పనులు జరగడం లేదని సమాచారం. తమ పట్టా భూములను 22ఏ నిషేధితా జాబితాలో పెట్టారంటూ ప్రభుత్వం నుంచి ప్రయివేటు ఉద్యోగుల వరకు..రాజకీయ నాయకులు సైతం ఆరోపణలు చేస్తున్నారు. రిజస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనులు కావడం లేదని బాధితులు వాపోతున్నారు. తాజాగా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్.. రెవెన్యూ శాఖలో జరుగుతున్న వ్యవహారాన్ని బట్టబయలు చేశారు.
