క్రైమ్

గణపయ్య కోసం బాహబాహీ.. ఒకరు మృతి

రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వినాయకచవితి పండుగ సందర్భంగా గణపయ్య విగ్రహం కోసం జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన ఘట్‌కేసర్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే..చౌదరిగూడ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు ఆదివారం అర్ధరాత్రి వినాయక విగ్రహం కొనుగోలు చేసేందుకు జోడిమెట్ల సమీపంలోని వినాయక విగ్రహాల షెడ్డు వద్దకు వెళ్లారు. అక్కడ విగ్రహాలు విక్రయిస్తున్న వ్యాపారులతో ధర విషయంలో వాగ్వాదం నెలకొంది.మాటమాట పెరిగి ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. వ్యాపారుల దాడిలో చౌదరిగూడకు చెందిన పసులాది కిరణ్‌ (34)కు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు సమాచారం.