National
కాక్రోచ్ జనతా పార్టీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి..? ఉద్యమమా.. రాజకీయమా..?- మరికొద్ది గంటల్లో కీలక ప్రకటన
దేశ రాజకీయాల్లో గత రెండు నెలలుగా అత్యంత చర్చనీయాంశంగా మారిన పేరు కాక్రోచ్ జనతా పార్టీ. నీట్ పేపర్ లీక్ వివాదంతో ప్రారంభమైన ఈ ఉద్యమం.. కేవలం విద్యా వ్యవస్థకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా యువత ఆకాంక్షలకు ప్రతీకగా మారింది. కేంద్ర ప్రభుత్వం విద్యా శాఖలో మార్పులు ప్రకటించడం, విద్యాశాఖ మంత్రిని తప్పించడం వంటి పరిణామాల తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఒకే అంశంపై ఉంది. కీలక సమావేశంలో కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్ వ్యూహంపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
