National
CJP: రాజకీయ పార్టీగా CJP? అభిజీత్ దీప్కే కీలక ప్రకటన.. అదే మా లక్ష్యం..
CJP: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)ని రాజకీయ పార్టీగా మార్చే అంశంపై ఆ పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే స్పందించారు. కీలక ప్రకటన చేశారు. కాక్రోచ్ పార్టీని పొలిటికల్ పార్టీగా మార్చే యోచన ప్రస్తుతానికి లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రెజర్ గ్రూప్ గానే పని చేస్తామని వెల్లడించారు. దేశంలోని యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటమే తమ పంథా అని తెలిపారు. ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేస్తామన్నారు. దేశంలో స్టూడెంట్స్ ఎక్కడ ఉద్యమం చేసినా అండగా ఉంటామని వెల్లడించారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యూహ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అభిజీత్ ఈ కీలక ప్రకటన చేశారు.
