దునియా

CJP: 48 గంటల్లో సీఈసీ రాజీనామా చేయకుంటే జంతర్‌ మంతర్‌ 2.0 : అభిజీత్ దీప్కే

CJP: కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై దేశ రాజధాని ఢిల్లీ వేదికగా దుమారం చెలరేగింది. 'సర్‌' పేరిట సాగుతున్న పరిణామాలపై ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ముప్పుగా మారారని ధ్వజమెత్తిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే, ఆయన పదవి నుంచి వైదొలగడానికి 48 గంటల డెడ్‌లైన్ విధించారు. ఈ గడువులోగా సీఈసీ రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తిస్తామని, ఢిల్లీ నడిబొడ్డున ‘జంతర్‌ మంతర్‌ 2.0’ ప్రజా సంగ్రామాన్ని చేపట్టి తీరుతామని సంచలన హెచ్చరిక చేశారు.ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అభిజీత్‌ దీప్కే కేంద్ర ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటర్లే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, కానీ ప్రస్తుత సీఈసీ నేతృత్వంలో ఎవరు ఓటు వేయాలో ప్రభుత్వమే నిర్ణయించేలా దారుణమైన పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. ‘‘ప్రజాస్వామ్యానికి ప్రధాన ఎన్నికల కమిషనరే పెద్ద అవరోధంగా మారారు.