National
సీజేఐ సీరియస్.. నల్సార్ విద్యార్థులకు బీసీఐ చైర్మన్ క్షమాపణలు
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా క్షమాపణలు చెప్పారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో బీసీఐ చైర్మన్ ఈ మేరకు నల్సార్ స్టూడెంట్స్‌కు క్షమాపణలు చెప్పినట్టు సమాచారం. ‘నా మాటలు బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నా’ అని ఓ లేఖ విడుదల చేశారు. ఇదిలాఉండగా, సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్‌ను చీఫ్ గెస్టుగా పిలువొద్దని, ఆయన చేతుల మీదగా డిగ్రీ పట్టాలు అందుకోబోమని నల్సార్ లా వర్సిటీ విద్యార్థులు ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే.
