National
CJI : మధ్యలో మీ జోక్యం ఏంటి?.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సీరియస్!
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఆయన చేతుల మీదుగా డిగ్రీ పట్టాలు తీసుకోబోమని ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకోవడంపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘నాకు విద్యార్థులకు మధ్య జరిగే సంభాషణలో మీ జోక్యం ఏంటి?’ అంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI)పై CJI సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని, హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఇచ్చిన ఆదేశాలపై మండిపడినట్టు తెలుస్తోంది.
