తెలంగాణ
కోదాడలో సీఐ దాష్టీకం.. మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం!
తమ జీవనాధారం తొలగించారని, న్యాయం చేయాలని రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న బాధితులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో డబ్బా దుకాణాల తొలగింపును నిరసిస్తూ బాధితులు నిరసనకు దిగారు. ఆ ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలికి చేరుకున్న కోదాడ టౌన్ సీఐ శివశంకర్.. ఆందోళన చేస్తున్న మాదాల ఉపేందర్పై దాడికి పాల్పడినట్టు సమాచారం.అతన్ని అందరి ముందే నెట్టేయడంతో బాధితుడు కిందపోయిన దృశ్యాలు వీడియోలో స్పష్టం కనిపిస్తోంది. బాధితులతో సీఐ ప్రవర్తించిన తీరును నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. జీవనాధారం కోల్పోయిన వారు నిరసన చేస్తే ఇలాగేనా వారితో ప్రవర్తిస్తారా? అంటూ సోషల్ మీడియా వేదికగా సీఐ శివశంకర్ తీరును ఎండగడుతున్నారు.
