తెలంగాణ
రాష్ట్రంలో డీఐజీ స్థాయి అధికారిపై సీఐడీ విచారణ?
రాష్ట్రంలో మరో సంచలనం చోటుచేసుకుంది. ఓ డీఐజీ అధికారిపై సీఐడీ విచారణకు రాష్ట్ర డీజేపీ సీవీ ఆనంద్ ఆదేశించినట్టు సమాచారం.సదరు అధికారి.. అధికార దుర్వినియోగంతో పాటు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అతని ఆస్తులకు సంబంధించి వరుస ఫిర్యాదులు అందడంతో సీఐడీ విచారణకు ఉన్నతాధికారుల ఆదేశించినట్టు సమాచారం. లంగాణలో ప్రస్తుతమున్న 11 మంది డీఐజీలలో కేంద్ర సర్వీసులో ఉన్న ఇద్దరిని మినహాయిస్తే, మిగతా 9 మందిలో ఒకరైన డీఐజీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందినట్టు సమాచారం. సదరు డీఐజీ దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాలో 20 ఎకరాలు కొనుగోలు చేశాడని, ప్రస్తుతం నిర్మిస్తున్న ఇంటి కోసం పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.
