TG : ధరణి అక్రమాలపై సీఐడీ కేసు.. రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ కోసం తెచ్చిన ‘ధరణి’ పోర్టల్‌లో భారీ అక్రమాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే.అందులోని లొసుగులను అడ్డుపెట్టుకుని కొందరు అక్రమార్కులు పేదలు, ప్రభుత్వ భూములను కాజేయాలని చూశారు.వేల ఎకరాల భూముల ఓనర్ షిప్ రాత్రికి రాత్రే మారిపోయినట్టు ఆరోపణలు ఉన్నాయి.ఈ వ్యవహారంలో తాజాగా సీఐడీ దూకుడు పెంచింది. గతంలో ధరణిని అడ్డుపెట్టుకుని భూ అక్రమాలు, దోపిడీకి పాల్పడిన వారిపై చర్యలకు ఉపక్రమించింది. శనివారం ఉదయం ధరణి పోర్టల్ భూ రికార్డుల అక్రమాల వ్యవహారంపై సీఐడీ (CID) విభాగం రాష్ట్రవ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహించింది. పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూసిన IL&FS టెక్నాలజీ లిమిటెడ్, TerraCIS టెక్నాలజీ లిమిటెడ్ సంస్థల పాత్రతో పాటు, అనధికారిక లాగిన్లు, రికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడిన వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినట్టు సమాచారం. సీఐడీ అధికారులు 15 ప్రత్యేక బృందాలుగా విడిపోయి ఏకకాలంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, గజ్వేల్ తదితర కీలక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.
