తెలంగాణ
చార్మినార్ నుంచి ఊడిపడిన పెచ్చులు.. పురావస్తు శాఖపై తీవ్ర విమర్శలు!
హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్త ఐకాన్‌గా విరాజిల్లుతున్న చారిత్రక చార్మినార్ రక్షణ, నిర్వహణ పట్ల భారత పురావస్తు శాఖ (ASI) తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో చార్మినార్ మొదటి అంతస్తు లాడ్ బజార్ వైపు ఉన్న భాగం నుంచి సున్నపు పెచ్చులు, డిజైన్ పువ్వుల భాగాలు ఊడి కిందపడిపోయాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం రాత్రి సమయంలో జరగడం, ఆ సమయంలో పర్యాటకులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
