National
'చౌకీదార్ చోర్ హై' పరువునష్టం కేసు.. రాహుల్ గాంధీకి ఊరట!
ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన ‘చౌకీదార్ చోర్ హై’ వ్యాఖ్యలపై నమోదైన క్రిమినల్ పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి దిగువ ట్రయల్ కోర్టులో కొనసాగుతున్న విచారణ ప్రక్రియపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపి మహారాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వారాల గడువుతో నోటీసులు జారీ చేసింది.
