క్రైమ్
Chit Fund Scam: కూకట్పల్లిలో చిట్టీల పేరుతో టోకరా.. రూ.20 కోట్లతో పరార్
హైదరాబాద్ కూకట్పల్లిలో చిట్టీల పేరుతో ఘరానా మోసం వెలుగుచూసింది. కిలాడీ దంపతులు అమాయకులను నిండా ముంచేశారు. సుమారు 20కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు. కూకట్ పల్లిలోని సాయిచరణ్ కాలనీకి చెందిన రమణా రెడ్డి, సీతమ్మ దంపతులు కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. 15ఏళ్లుగా అక్కడే ఉంటూ స్థానికుల్లో మంచి నమ్మకం సంపాదించారు. వీరి దగ్గర సుమారు 50 మంది వరకు చిట్టీలు కట్టారు.
