తెలంగాణ
TG : తెలంగాణలో చల్లగాలులు.. 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్
రాష్ట్రంలో ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.దీంతో చలి తీవ్రత పెరిగింది.ఉదయం లేవాలంటేనే ప్రజలు జంకుతున్నారు.రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రానున్న 3 రోజుల పాటు చలిగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 29 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సూర్యాపేట, జోగులాంబ గద్వాల, ఖమ్మం, జనగామ జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోనూ రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉంది.
