Nonveg : భారీగా పెరగనున్న చికెన్ ధరలు!
త్వరలోనే చికెన్ ధరలు భారీగా పెరగనున్నట్టు తెలుస్తోంది. నెల కిందట కిలో చికెన్ రూ.240 నుంచి 260 మధ్యలో ఉండేది. అయితే, అది కాస్త ప్రస్తుతం కేజీ రూ.280 నుంచి 300లకు పైగా పలుకుతోంది. అయితే, మున్ముందు మరింత ధరలు పెరిగే చాన్స్ ఉందని సమాచారం. అందుకు కారణంగా కోళ్లకు వేసే దాణా ధరలు ప్రియం కావడమే అని పౌల్ట్రీవర్గాలు వెల్లడించాయి.ఈ ఏడాది దాణా ధరలు పెరగడంతో కోళ్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే కోళ్ల పెంపకం నుంచి మార్కెటింగ్ వరకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపేందుకు దేశవ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. చికెన్ ధరల్లో హెచ్చుతగ్గులు, దాణా ధరలు పెరగడంతో పౌల్ట్రీ పరిశ్రమపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే ధరల స్థిరీకరణకు పౌల్ట్రీ సంఘాలు కార్యాచరణ చేపట్టాయి.ఇందులో భాగంగానే లైవ్ చికెన్ కిలోకు కనీసం రూ.110 ధరను ప్రామాణికంగా నిర్ణయించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
