Nonveg : భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?
చికెన్ ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి. మొన్నటివరకు కేజీకి రూ.300 నుంచి 320 వరకు పలికిన చికెన్.. కార్తీకమాసం ప్రారంభం కావడంతో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. ఈ మాసంలో చాలా మంది నాన్ వెజ్‌కు దూరంగా ఉంటారు. దీంతో డిమాండ్ పడిపోవడంతో సప్లయ్ పెరిగి ధరలు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. కార్తీకమాసంలో తొలి ఆదివారం(నేడు) కిలో చికెన్‌పై ఏకంగా రూ. 50 నుంచి రూ. 80 వరకు ధర తగ్గింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్టు సమాచారం. డిమాండ్ పడిపోవడంతో పౌల్ట్రీ వ్యాపారులు ధరలను తగ్గించక తప్పలేదని తెలుస్తోంది. గత ఆదివారం రూ.300పైగా పలికిన స్కిన్లెస్ చికెన్ ధరలు నేడు చాలా ప్రాంతాల్లో రూ.260లోపే విక్రయిస్తున్నారు. తెలంగాణలోని ప్రధాన నగరాలు, హైదరాబాద్‌లో కేజీ స్కిన్లెస్ చికెన్ రూ.260 నుంచి రూ. 270 వరకు అమ్ముతున్నారు.వరంగల్‌లో రూ.250 నుంచి రూ.260, కామారెడ్డిలో రూ.260, నిజామాబాద్‌లో రూ.200 నుంచి రూ.260 మధ్య విక్రయిస్తున్నట్టు తెలిసింది.
