తెలంగాణ
Chicken price Today: చికెన్ ప్రియులకు బిగ్ రిలీఫ్.. భారీగా దిగొచ్చిన ధరలు.. కిలో ఎంతంటే?
ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాహార ప్రియులు చికెన్ షాపుల ముందు క్యూ కడుతుంటారు. గత కొన్ని వారాలుగా ఆకాశాన్నంటిన చికెన్ ధరలు ప్రస్తుతం గణనీయంగా దిగిరావడంతో తెలుగు రాష్ట్రాల్లోని చికెన్ లవర్స్‌కు భారీ ఊరట లభించింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కిలో చికెన్ ధరలు సామాన్యుడికి అందుబాటులోకి రావడంతో రిటైల్ మార్కెట్లలో కొనుగోళ్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. హైదరాబాద్ మహానగరంలో కొన్ని రోజుల క్రితం వరకు రూ.280 నుంచి రూ.300 వరకు విక్రయించిన స్కిన్లెస్ చికెన్ ధర ప్రస్తుతం గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో లైవ్ బర్డ్ ధర రూ.120 నుంచి రూ.140 వరకు పలకగా, రిటైల్ షాపుల్లో విత్ స్కిన్ చికెన్ కిలో రూ.180 నుంచి రూ.200రేంజ్లో విక్రయిస్తున్నారు. అలాగే స్కిన్లెస్ చికెన్ కిలో రూ.220 నుంచి రూ.240 వద్ద కొనసాగుతోంది.
