పాఠశాలల్లో చికెన్ బిర్యానీ.. కండిషన్స్ అప్లయ్!
విద్యార్థులకు పాఠశాలల్లో చికెన్ బిర్యానీ వడ్డించేందుకు తమిళనాడు సర్కార్ ప్రతిపాదన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని మీద ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనిమీద ప్రతిపక్ష డీఎంకే పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తినా సీఎం విజయ్ మాత్రం ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. విద్యార్థులను పోషకాహార లోపం నుంచి బయటపడేయాలని టీవీకే సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం (మిడ్-డే మీల్స్) కింద వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించాలని, దీని మీద అధ్యాయనం చేయాలని ఇప్పటికే అధికారులను సీఎం విజయ్ ఆదేశించినట్టు తెలిసింది. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు, ప్రభుత్వ బడుల్లో వారి హాజరు శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు తాజాగా తమిళనాడు విద్యాశాఖ మంత్రి తెలిపారు.
