ఏపీ
శకునిగా చంద్రబాబు.. బిహార్‌ను మించిన ‘జంగిల్ రాజ్’ : వైఎస్ జగన్
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రస్తుతం నెలకొన్నరాజకీయ పరిస్థితులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. నామినేషన్ల టైంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై జగన్ మీడియాతో మాట్లాడారు. నామినేషన్ పత్రాలను చించేయడం,కేంద్రాల వద్ద వైసీపీ అభ్యర్థులపై దాడులను తీవ్రంగా ఖండించారు. నామినేషన్ల వేయకుండా వైసీపీ నేతలను హౌస్ అరెస్టులు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లకు పిలిపించి మరీ ముందస్తు అరెస్టులు చేశారన్నారు.
