తెలంగాణ

Chanakya strategy’s: వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. ప్రజల మూడ్ ఏంటి? జెన్-జీ షాకింగ్ తీర్పు!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన రాజకీయ సర్వే ఆసక్తికర అంశాలను వెల్లడించింది. రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం, బీఆర్ఎస్, బీజేపీల ప్రభావం, ముఖ్యంగా జెన్-జీ(Gen Z), యువ ఓటర్ల రాజకీయ ఆలోచనలపై ఈ సర్వే కీలక సంకేతాలు ఇచ్చినట్లు చాణక్య స్ట్రాటజీస్ పేర్కొంది. 2023అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం బీఆర్ఎస్ గ్రాఫ్ గణనీయంగా పెరిగిందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే పేర్కొంది. 2023అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కేవలం ఒక శాతం ఓటు శాతం ఎక్కువగా సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కానీ ప్రస్తుతం కాంగ్రెస్‌తో పోలిస్తే బీఆర్ఎస్ గ్రాఫ్ ఐదు శాతం పెరిగినట్లు సర్వేలో వెల్లడైనట్లు పేర్కొంది.