క్రైమ్

మణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్..అడ్డుకోబోయిన మహిళపై!

హైదరాబాద్ మహానగరంలో చెడ్డీ గ్యాంగ్ సంచారం మరోసారి కలకలం రేపింది. మణికొండ నెక్నాంపూర్‌లోని ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్ వెనుక వైపున్న చెరువు ఫెన్సింగ్‌ను కత్తిరించి సుమారు ఆరుగురు సభ్యుల చెడ్డీ గ్యాంగ్ ముఠా లోపలికి చొరబడింది. సీ-బ్లాక్ మెట్ల మార్గం ద్వారా ఒక ఫ్లాట్‌లోకి ప్రవేశించి విలువైన వస్తువులను దోచుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో వారిని గమనించి అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక మహిళపై ఆయుధాలతో దాడికి పాల్పడగా.. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరార్ అయినట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున 3:20 గంటల ప్రాంతంలో ఆరుగురు అనుమానితులు అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించినట్టు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. సదరు మహిళతో ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం.