National
విద్యుత్ కొరత విమర్శల వేళ రంగంలోకి కేంద్రం.. పశ్చిమ బెంగాల్ పర్యటనలో కిషన్ రెడ్డి!
దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరగడం, బొగ్గు సరఫరాపై రాజకీయంగా తీవ్ర చర్చ కొనసాగుతున్న వేళ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్నారు. తక్కువ రుతుపవన వర్షపాతం కారణంగా అనేక ప్రాంతాల్లో జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో, గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడేందుకు థర్మల్ విద్యుత్ ప్లాంట్లపై భార అదనంగా పడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గు లభ్యతను, రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
