National
సిమ్‌కార్డుల విషయంలో కేంద్రం వార్నింగ్.. నిందితులకు మూడేళ్ల జైలు, భారీ జరిమానా!
ఇతరుల గుర్తింపు పత్రాలను వారి ప్రమేయం లేకుండా దుర్వినియోగం చేస్తూ సిమ్ కార్డులు పొందడం, ఐఎంఈఐ (IMEI) నంబర్లను అక్రమంగా మార్చడంపై కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. కొత్త టెలికమ్యూనికేషన్ల చట్టం-2023 ప్రకారం ఇలాంటి చర్యలను తీవ్రమైన నేరాలుగా (Cognizable and Non-bailable) పరిగణిస్తామని, నిందితులకు మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.50లక్షల వరకు జరిమానా విధించే అవకాశముందని స్పష్టం చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల వెలుగుచూసిన ఓ మోసం ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయాన్ని వివరించింది.
