తెలంగాణ

మైనార్టీల ఓటు హక్కు తొలగించేందుకు కేంద్రం కుట్ర : సీఎం రేవంత్ రెడ్డి

మైనార్టీల ఓట్లు తొలగించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా, మైనార్టీల స్కారల్స్‌షిప్స్ విషయంలోనూ బీజేపీ పాలిటిక్స్ చేస్తోందని సీఎం ఎద్దేవాచేశారు. బుధవారం బంజారా హిల్స్‌లోని బంజారా భవన్‌లో జాతీయ విద్యా, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం మైనారిటీలకు అన్ని వేళలా, అన్ని రకాలుగా పూర్తి అండగా ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో విద్యా, నీటిపారుదల రంగాలకు భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. నెహ్రూ వేసిన బలమైన పునాదుల వల్లే నేడు విద్యా, ఇరిగేషన్ రంగాల్లో దేశం గొప్ప వృద్ధిని సాధించిందని కొనియాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను తొలి విద్యాశాఖ మంత్రిగా నియమించి, దేశవ్యాప్తంగా వర్సిటీలు, ఐఐటీలను కాంగ్రెస్ ప్రభుత్వమే నెలకొల్పిందని పేర్కొన్నారు.