తెలంగాణ
ఎల్‌బీనగర్-హయత్‌నగర్ ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
రాష్ట్రంలో మరో ఎలివేటెడ్ కారిడార్ రాబోతున్నది. ఇప్పటికే జేబీఎస్ నుంచి షామీర్ పేట మార్గంలో ఎలివేడెట్ కారిడార్‌కు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ అడ్డుగా ఉన్న భవనాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.తాజాగా రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నగరవాసులకు శుభవార్త చెప్పారు. ఎల్‌బీనగర్-హయత్ నగర్ మార్గంలో మరో ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వెల్లడించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా భేటీ అయిన కోమటిరెడ్డి.. తెలంగాణలో కీలకమైన మౌలిక వసతులు, రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి చేసిన వినతులపై స్పందించిన కేంద్రమంత్రి పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
