తెలంగాణ

తెలంగాణకు కేంద్రం షాక్.. రీజినల్ రింగ్ రోడ్డుకు బ్రేక్!

 తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక రంగానికి ‘సూపర్ గేమ్ ఛేంజర్’గా భావిస్తున్న హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టు నిర్మాణంలో కీలక అవరోధం ఏర్పడింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు చెందిన దక్షిణ భాగం (South Segment) ఎలైన్‌మెంట్ ప్రతిపాదనలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో పడిపోవడంతో పనుల్లో పురోగతి నిలిచిపోయింది. దీంతో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంపై తీవ్ర అనిశ్చితి నెలకొనగా, శీఘ్రగతిన ఆమోదం తెప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.