సెంట్రల్ పార్క్ బంద్.. కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR)లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పలుమార్లు ఆందోళలనకు పిలుపునిచ్చింది.ప్రస్తుతం జంతర్ మంతర్‌లో నిరసనలకు అనుమతి బ్యాన్ చేయడంతో కనాట్ ప్రదేశంలో తిరంగా ర్యాలీకి సేజేపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కనాట్ ప్లేస్, సెంట్రల్ పార్క్‌లను మూసివేసింది.ఈ విషయం సుప్రీం మెట్లు ఎక్కగా.. స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. వ్యాపారులకు నష్టం వాటిల్లినట్లు తెలిస్తే రాజ్యాంగ పరిహార అధికారాలను ఉపయోగించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. కనాట్ ప్లేస్, సెంట్రల్ పార్క్‌ల మూసివేతపై ఢిల్లీ కిరాణా కమిటీ, ఢిల్లీ ఐరన్ అండ్ హార్డ్‌వేర్ మర్చంట్ అసోసియేషన్ తరఫున అడ్వకేట్ జై అనంత్ దేహద్రాయ్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.
