తెలంగాణ

వైఎస్ జగన్, మమత సొంతగూటికి రండి : భట్టి విక్రమార్క

దేశంలో సమగ్ర ఓటరు జాబితా(ఎస్ఐఆర్)పేరిట లక్షల ఓట్లు డిలీట్ చేస్తున్నారని, కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.నిన్న మధ్యాహ్నం కేరళం కొచ్చిలో నిర్వహించిన ఇండియా టు టే కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. దేశంలో అన్ని వర్గాలు, మతాలను సమైక్యంగా ఉంచి అభివృద్ధి పథంలో నడిపించే విజన్ ఒక్క కాంగ్రెస్‌కే ఉందని వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మమతా బెనర్జీ, శరద్‌పవార్ సహా పాత కాంగ్రెస్ నేతలంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు. ఓటు చోరీ జరిగిందని ప్రజలు అనుమానిస్తున్న వేళ ఎన్నికల సంఘం పారదర్శకత మీద కేంద్రం ప్రభుత్వం స్పందించి సమాధానం చెప్పాలని కోరారు. ఎన్నికల సంఘం తన నిష్పాక్షికతను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాలంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.