National
CEC: సీఈసీ జ్ఞానేష్ కుమార్ కుర్చీకి ఎసరు తప్పదా? క్లైమాక్స్ కౌంట్‌డౌన్ మొదలైందా!
CEC: దేశ ఎన్నికల వ్యవస్థను కుదిపేస్తున్న "స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్" (ఎస్ఐఆర్) వ్యవహారం ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరిత క్లైమాక్స్‌కు చేరుకుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలు, ఓటర్ల జాబితా సవరణ పేరుతో రేగిన అలజడి దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒకవైపు ఆయన ఏకపక్ష వైఖరిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, మరోవైపు అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి విపక్షాలు 'జైల్ భరో' ఉద్యమానికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. సీఈసీ పదవిలో జ్ఞానేష్ కుమార్ కొనసాగుతారా? లేక మునుపెన్నడూ లేని విధంగా రాజ్యాంగ సంక్షోభం తలెత్తనుందా? అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జోరందుకుంది.
