ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు.. మంత్రి పొన్నం క్లారిటీ
రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని గతంతో అనేక ఫిర్యాదులు వచ్చాయి. రద్దీ సమయాల్లో దొంగతనాలు, కొందరు పోకిరీలు మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వేధించడం వంటివి చేసేవారు. అక్కడ ఇక్కడ తాకుతూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవారు. దీనికితోడు ఇటీవలి కాలంలో ఆర్టీసీ సిబ్బందిపై కొందరు దాడులకు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి వాటి నుంచి బాధితులను రక్షించానికి సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని ప్యాసింజర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. సాధారణ ఆర్టీసీ బస్సుల్లో సీసీ టీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం లేదని స్పష్టంచేశారు.కేవలం కార్పొరేషన్ అండర్లో నడుపుతున్న ప్రీమియం, ఎలక్ట్రిక్ బస్సుల్లో మాత్రమే ప్రస్తుతం సీసీటీవీలను అందుబాటులోకి తెచ్చామని రవాణా శాఖ మంత్రి వెల్లడించారు.
