ఏపీ

CBN Emotional: గ్రాఫిక్స్ అన్నవాళ్లు ఇక్కడికి వచ్చి చూడండి.. చంద్రబాబు భావోద్వేగం!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు ప్రధాన వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండవ దశతో పాటు, విజయవాడ-మంగళగిరి రహదారిని అనుసంధానిస్తూ బకింగ్‌హామ్ కెనాల్‌పై రూ.82కోట్లతో అత్యంత ఆధునికంగా నిర్మించిన నూతన స్టీల్ వంతెనను సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. ఉండవల్లి సమీపంలో ప్రత్యేక శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం స్వయంగా కాలినడకన వంతెనను, నూతన రహదారి నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన  భారీ బహిరంగ సభలో చంద్రబాబునాయుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.