ఏపీ

ఒంగోలులో సీబీఐ ఆకస్మిక తనిఖీలు..ఏం జరుగుతోంది?

ఏపీలోని సీబీఐ అధికారులు రంగ ప్రవేశం వేశారు. ఒంగోలు అద్దంకి బస్టాండ్ K.B రెస్టారెంట్‌లో అధికారుల ఆకస్మిక సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. చీమకుర్తి గ్రానైట్ క్వారీ ప్రమాదాల కేసులో పలువురిని రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ క్వారీలో ఇటీవలి కాలంలో వరుసగా ప్రమాదాలు జరుగుతుండటమే కారణం. ఈ మధ్యే క్వారీలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందగా.. ప్రభుత్వం మరోసారి దీనిపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ క్వారీ విషయంలో విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నట్టు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా తమకు నచ్చిన వారికి మైనింగ్ కాంట్రాక్టులు అప్పజెప్పిందని, ఏమాత్రం భద్రతా ప్రమాణాలు పాటించకుండా గెలాక్సీ స్టోన్ మైనింగ్ నడుస్తోందని అధికార కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా, క్వారీ సేఫ్టీ మెజర్స్ పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సిన మైన్స్ సేఫ్టీ అధికారి (DDMS) రవిశంకర్ ఇటీవల రూ.2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.