ప్రశ్నించే గొంతులను అణగదొక్కడానికే కేసులు, అరెస్టులు : హరీశ్ రావు
రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని,ఆపై అరెస్టు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.ఈ మేరకు మంగళవారం ఉదయం ‘ఎక్స్’ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభలోకి రానివ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం పోలీసులు క్రూరంగా వ్యవహారించారని, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మీద దాడి చేసి సభా హక్కులను కబళించార్నారు. ఆ పోలీసులే నేడు ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్నట్లు తాత మధు, నవీన్ రెడ్డిలను అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. హైకోర్టు చెప్పినా వినకుండా కేసులు పెట్టి అరెస్ట్ చేయడమంటే చట్టాన్ని, న్యాయస్థానాలను ధిక్కరించడమేనని అభిప్రాయం వ్యక్తంచేశారు.
