ఏపీ
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసు..
ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో పాటు అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణల మీద పోలీసులు కేసు ఫైల్ చేశారు. పులివెందులలోని స్థానిక పోలింగ్ కేంద్రం వద్ద రిటర్నింగ్ అధికారి ఆఫీసు ఎదుట చోటు చేసుకున్న రాజకీయ నిరసనలు, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనపై ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. ఈ ఘటనలో వైఎస్ జగన్తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి పైనా కేసు నమోదు చేసినట్టు తెలిసింది.
