క్రైమ్

కార్ యాక్సిడెంట్.. ఎంపీ లింగమనేని కొడుకు కేసులో కీలక పరిణామం

హైదరాబాద్‌లోని మాదాపూర్ సమీపంలో గల ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో 26 ఏళ్ల యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో నిందితుడు ఏపీకి చెందిన జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కొడుకు సంజూశ్‌గా పోలీసులు గుర్తించారు. ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే యువతి ప్రమాదవశాత్తు మృతి చెందిందని పోలీసులు నిర్దారణకు వచ్చారు. దీంతో నిర్లక్ష్యంగా కారు నడిపి యువతి మరణానికి కారణమైన ఎంపీ లింగమేని కొడుకు సంజూశ్ మీద మాదాపూర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. అయితే, నిందితుడిని ముందుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు .. అతనికి బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేసినట్టు సమాచారం. ఎందుకంటే మద్యం మత్తులో కారు నడిపాడా? అని తెలుసుకునేందుకు ఇలా చేసినట్టు తెలిసింది.ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఈ టెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.