స్మిత్‌కు సెల్యూట్.. భారత పైలట్‌పై మోదీ, నెతన్యాహు ప్రశంసల వర్షం
Captain Smith Machar: 31 వేల అడుగుల ఎత్తులో గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో జరిగిన ఊహించని దాడిని సమర్థంగా ఎదుర్కొని, వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను నిలబెట్టిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలను ప్రపంచ నేతలు కొనియాడుతున్నారు. తీవ్ర గాయాలపాలైనా ప్రాణాలకు తెగించి విమానాన్ని, ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ఆయన తీరుపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ‘ఎక్స్’ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను ‘రియల్ హీరో’గా అభివర్ణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన అసమాన పోరాట పటిమను కొనియాడారు. కాక్‌పిట్‌లో కో-పైలట్ మారణాయుధంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినప్పటికీ, ఏమాత్రం వెరవకుండా ఆయన ప్రదర్శించిన సాహసం వల్లే పెను ముప్పు తప్పిందని పేర్కొన్నారు. గగనంలో వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన స్మిత్ మచ్చర్‌ను చూసి యావత్ దేశం గర్విస్తోందని చెబుతూ, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.
