International
cancer-vaccine: వైద్యరంగంలో మరో కీలక అడుగు.. క్యాన్సర్ వ్యాక్సిన్ ఫేజ్-3 ట్రయల్స్ సక్సెస్!..
క్యాన్సర్ మహమ్మారిపై పోరాటంలో వైద్యరంగంలో మరో కీలక అడుగుపడింది.. ప్రముఖ ఫార్మాదిగ్గజాలు మోడెర్నా, మెర్క్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఎమ్ఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ తుదిదశ క్లినికల్ ప్రయోగాల్లో ఆశించిన ఫలితాలు సాధించింది. అత్యంత ప్రమాదకరంగా భావించే చర్మ క్యాన్సర్ మెలనోమా రోగుల్లో శస్త్రచికిత్స అనంతరం క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టకుండా, శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకోవడంలో ఈ వ్యాక్సిన్ విజయవంతమైనట్లు పరిశోధకులు ప్రకటించారు.
